![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1001 లో..... రాజు, లక్కీ వెయిటర్ గెటప్ వేస్తారు. ఇప్పుడే రాకండి నేను లోపలికి వెళ్ళాక రండి అని ఐశ్వర్య వాళ్ళకి చెప్పి లోపలికి వెళ్తుంది. ఇంకా డెకరేషన్ చెయ్యలేదని ఈవెంట్ వాళ్ళతో భ్రమరాంబ గొడవ పడుతుంది. డెకరేషన్ కోసం అమ్మాయి ఫ్లవర్స్ తీసుకొని వస్తుందని అతను భ్రమరాంబకు చెప్తాడు. అప్పుడే నందు ఫ్లవర్స్ తీసుకొని తనని పెంచిన కానిస్టేబుల్ తో వస్తుంది. అప్పుడే కార్ లో ఇందు, స్వాతి ఎంట్రీ ఇస్తారు. అపర్ణ వాళ్ళకి ఎదురుగా వెళ్తుంది. అపర్ణని చూసి నందు గుర్తుపట్టి నానమ్మ అని ఎమోషనల్ అవుతుంది. స్వాతిని నందు చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది.
అంటే ఇన్నిరోజులు మా అక్కతోనే తిరిగానా అని నందు అనుకుంటుంది. అపర్ణ దగ్గర ఇందు ఆశీర్వాదం తీసుకుంటుంది. వాళ్లే మా నానమ్మ అక్క అని జరిగింది మొత్తం కానిస్టేబుల్ కి నందు చెప్తుంది. మరి వెళ్ళు మాట్లాడమని అతను అనగానే లేదు నేను అనుకుంది జరిగేవరకు వాళ్ళని కలవనని నందు చెప్తుంది. ఆ తర్వాత ఇందు అందంగా రెడీ అవ్వడం చూసి రాజు అలాగే చూస్తుంటాడు. ఇది రాక్షసి అనుకున్న కానీ అందాల రాక్షసి అని లక్కీతో రాజు అంటాడు. ఆ తర్వాత స్వాతి తన మనుషులకు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది. ఎక్కడున్నారు కిడ్నాప్ చెయ్యడానికి అంతా సిద్దమే కదా అని మాట్లాడుతుంది. అదంతా ఇందు వింటుంది. ఆ తర్వాత స్వాతి చెప్పినట్టు కిడ్నాప్ చెయ్యడానికి వచ్చిన వాళ్ళు వెయిటర్ గెటప్ లో వస్తారు. వాళ్ళు రాజు వాళ్ళు ఎదురుపడుతారు. ఒకరికొకరు నిజమైన వెయిటర్ లు అని అనుకొని భయపడుతారు.
ఆ తర్వాత అపర్ణ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే భ్రమరాంబ వచ్చి తనని అవమానిస్తుంది. అది నందు చూస్తుంది. భ్రమరాంబ వెనకాలే వెళ్లి దుప్పటి కప్పి కొట్టి వెళ్ళిపోతుంది. అప్పుడే శేషు వస్తాడు.. ఏమైందని అడుగుతాడు. ఎవరో కొట్టి పారిపోయాడని భ్రమరాంబ చెప్తుంది. తరువాయి భాగంలో ఇందుని పట్టుకొని నందు ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు రాజు మాస్క్ తీసి మళ్ళీ త్వరగా పెట్టుకుంటాడు. అపర్ణ చూసి బాబు ఒకసారి మాస్క్ తియ్ అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |